హాస్య ,సంగీత ప్రియులకు ఆనందం కలిగించే వార్త

updated: February 20, 2018 19:16 IST
హాస్య ,సంగీత ప్రియులకు ఆనందం కలిగించే వార్త

హాస్యము, సంగీతము  ప్రధానాంశాలుగా గత కొన్నేళ్ళుగా ఆంధ్రులను అలరించిన పత్రిక హాసం. ఆ పత్రిక ఇచ్చిన ఉత్సాహం ,ప్రేరణతో అన్ని చోట్లా హాసం క్లబ్ లు వెలిసాయి. హాస్య గీతాలు, పేరడీ పాటలు, జోక్స్, మిమిక్రీ, హాస్య-సంగీత విశేషాలతో ప్రతీనెలా కార్యక్రమాలు జరుగుతూంటాయి. ఈ రెగ్యులర్ పోగ్రామ్ లతో  పాటు ఈ క్లబ్ లో ప్రత్యేక కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి.  హైదరాబాద్ హాసం క్లబ్ మరియు శ్రీ త్యాగరాయ గాన సభ సంయుక్త నిర్వహణలో ఈ సారి  ప్రముఖ సినీ రచయిత నివాస్ గారికి ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసారు. 

వేదిక త్యాగరాయ గాన సభ మినీ హాల్, కళా సుబ్బారావు ఎ.సి. కళావేదిక,

సమయం పిభ్రవరి 24, 2018, శనివారం సాయింత్రం 6.30 గంటలకు

ఈ పోగ్రామ్ కు హాస్య ,సంగీత ప్రియులందరినీ ఆహ్వానిస్తున్నారు.

ఆహ్వానించువారు

ఈ క్లబ్ వ్యవస్దాపకులు శ్రీ వరప్రసాద్ రెడ్డి, 

స్టేట్ కన్వీనర్ శ్రీ ఎస్.వి.రామారావు, 

కో ఆర్డినేటర్...శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్.

శ్రీ.వి ఎన్. జనార్దన మూర్తి ...త్యాగరాయ గానసభ అధ్యక్ష్యులు

శ్రీమతి కళా శారద...త్యాగరాయ గానసభ కార్యదర్శి 

comments