కామెడీ పండించంటం అంత ఆషామాషి కాదు..ముఖ్యంగా స్టేజిపై అంటే ఇంకా కష్టం. అందుకే హాస్య నాటకాలు మనకు చాలా చాలా తక్కువ వస్తూంటాయి. కానీ తల్లా వఝుల సుందరం గారు మాత్రం ఆ లోటు ని తీర్చటానికి అన్నట్లుగా వరసగా హాస్య నాటకాలు అందిస్తూనే ఉన్నారు. ఎక్కడా ద్వంద్వార్దాలు,వెకిలితనం లేకుండా చక్కటి హాస్య వల్లరిలు ఆయన నాటకాల్లో తొంగిచూస్తాయి. తాజాగా ఆయన డైరక్ట్ చేసిన అలాంటి హాస్య ఆణిముత్యం అంతా తారు మారు.
శ్రీ మురళి కళా నిలయం హైదరాబాద్ బ్యానర్ పై ఈ నాటకం విజయవాడ సిద్దార్ద కాలేజ్,సుమధుర కళానికేతన్ సమక్షంలో ప్రదర్శింపడింది. ఈ నాటకానికి వచ్చిన వారు ఆద్యంతం నవ్వుతూ ఉండటమే ఈ నాటకం హై సక్సెస్ అనుకున్నారంతా. అయితే ఈ నాటకానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు అవార్డ్ లు వచ్చాయి.
ఫణి ప్రకాష్, జ్యోతి, సివి రమణ, సురేంద్ర, జెన్ని తదితరులు నటించిన ఈ నాటకానికి ప్రముఖ రచయత శంకర మంచి పార్ధసారధి రచన చేసారు.
కథ ఇలా సాగుతుంది..
ప్రసాద్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతని భార్య పేరు అలివేలు. ఇతని తండ్రి అతనికొచ్చే కట్నం డబ్బులతో కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు. సరే అది కుదరలేదు కాబట్టి..చెల్లిలి పెళ్లి కుదిరింది కాబట్టి..నాలుగు లక్షలు సర్దమని తండ్రి ఫోన్ చేస్తాడు. ఎలా అని ఆలోచిస్తున్న టైమ్ లో ప్రక్కింట్లో ఉన్న ఓ పెద్దాయన...ఇతని స్నేహితుడు మాధవరావు మామగారు.. ఆయనో మతిమరుపు మనిషి. ఈ ఇంటికి రావటం వెళ్ళటం జరుగుతూంటుంది. మాధవరావు ఎక్కడో రోడ్డు మీద కనిపించి..బ్యాంక్ లోంచి డ్రా చేసిన నాలుగు లక్షలు ఇంట్లో పెట్టమని..చెప్తే మామగారు ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని ప్రసాద్ ఇంటికి కాఫీ తాగటానికి వస్తాడు. ఆ నాలుగు లక్షలు బ్యాగు ఇక్కడ మర్చిపోతాడు. ప్రసాద్ తెచ్చిన బ్యాగ్, మాధవరావు మామగారు గారి బ్యాగ్ ఒకేలా ఉంటుంది. ప్రసాద్ ఆ బ్యాగ్ తీసుకెళ్లిపోతాడు. ఖాళీ బ్యాగ్ పెద్దాయన దగ్గర మిగులుతుంది.
ఆ డబ్బు దొరికిన ప్రసాద్ ..అవసరానికి డబ్బులు దొరికాయి..వాడుకుందాం అని మాట మార్చేయబోతాడు. ఈ డబ్బులు అనుకోకుండా మారిపోవటం, ప్రసాద్ బ్యాగ్ మామగారు తీసుకెళ్లటం, మాధవరావు ఆ బ్యాగ్ చూసుకోవటం, ప్రసాద్ ఇంట్లో బ్యాగ్ మారిపోయిందని అర్దం చేసుకుని , అది బయిటపడతాడేమో అని ఎదురుచూస్తే...ప్రసాద్ అది కవర్ చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మీ మామగారు మా ఇంట్లో మర్చిపోలేదని, పోలీస్ కంప్లైంట్స్ అవీ ఇవ్వద్దని, ఆయనకు మతిమరుపు కాబట్టి ఎక్కడో మర్చిపోయి ఉంటాడని నాటకమాడుతూంటాడు. మాధవరావు ఎలాగయినా ...ప్రసాద్ చేత నిజం చెప్పించాలని ప్రయత్నం. ఈ మధ్యలో సరదాగా జరుగతూ, బ్యాగ్ మార్పిడి గోలలో సరదాగా, హాస్యంగా జరుగుతుంది.
ఇంత మంచి నాటకం ఈ సారి మీ ప్రాంతంలో ప్రదర్శించినప్పుడు మిస్ కాకండి.
comments