ఈ రోజు...'ప్లూట్ .నాగరాజు' గారి అభిమానులకు పండుగ రోజే

updated: February 27, 2018 10:33 IST
ఈ రోజు...'ప్లూట్ .నాగరాజు' గారి అభిమానులకు పండుగ రోజే

'ప్లూట్ .నాగరాజు'   గా విశిష్ట ఖ్యాతి పొందిన నాగరాజు తాళ్లూరి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అలాగే ఆయన ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  దేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న తెలుగు తేజం ఆయన. 

 నిత్యం సంగీతారాధనలో మునిగితేలే  ఆయన తన బ్యాండ్ టీమ్ తో 'అనంత' తో కలిసి సౌత్ ఇండియన్ కల్చరల్ అశోశియోషన్ ఆధ్వర్యంలో  పోగ్రామ్ ఇస్తున్నారు.

అనంత అంటే అర్దం అనంతమైనది అని. ఈ పదాన్ని ఎక్కువగా భగవంతుడైన కృష్ణుడు గురించి చెప్పేటప్పుడు వాడుతూంటారు.  పేరుకు తగ్గట్లే తమ సంగీతం కూడా  అంతము లేనిదని...అనంతమైనదిగా సాగుతుందని,అందరి ప్రేమను పొందుతుందని టీమ్ భావిస్తోంది. ఈ బ్యాండ్ వ్యవస్దాపకుడు నాగరాజు తాళ్లూరి అభిమానలంతా ఈ పోగ్రామ్ కోసం సాయింత్రం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  

నాగరాజుగారు ఈ పోగ్రామ్ గురించి మాట్లాడుతూ... ప్రతీ ఆర్టిస్ట్ కు తమ అనుభవంతో కూడిన ప్రతిభను ప్రదర్శించేందుకు సమానామైన ప్రాధాన్యతతో సమయం ఇవ్వబడుతుందని అన్నారు.  రెండు గంటలు పాటు సాగే ఈ సంగీత కార్యక్రమం అధ్బుతం సృష్టిస్తుందని, సంగీత అభిమానుల మనస్సుల్లో ప్రత్యేకమైన స్దానం పొందుతుందని తెలుగు 100 ఆశిస్తోంది.  భావిస్తునన్నారు

 హైదరాబాద్ రవీంధ్ర భారతిలో 27-02-2018   సాయింత్రం ఆరుగంటల ముప్పై నిముషాలకు ఈ పోగ్రామ్  ప్రారంభం కానుంది.  

comments