ఘనంగా ...57 వ శ్రీరామ నవమి కల్చరల్ ఫెస్టివల్ వేడుకలు

updated: March 27, 2018 22:43 IST
ఘనంగా ...57 వ శ్రీరామ నవమి కల్చరల్ ఫెస్టివల్ వేడుకలు

ఘనంగా ...57 వ శ్రీరామ నవమి కల్చరల్ ఫెస్టివల్ వేడుకలు 

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||.  

హిందువులు ఎంతో భక్తితో జరుపుకునే పండుగ శ్రీరామ నవమి. ఈ రోజుని కేవలం శ్రీరాముడి జన్మదినమే కాక, సీతారామువ వివాహమహోత్సవం జరిగిన రోజుగానూ, అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజుగానూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలోనూ, గుళ్లల్లోనూ   సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం తమ శక్తికొలిదీ  నిర్వహిస్తుంటారు.

 తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలుని భక్తితో పాటు ఓ సరదా వేడుకగా రకరకాల ఈవెంట్స్ తో జరుపే వాళ్లూ ఉన్నారు.  అలా జరుపుకునే ఓ చోటు   కీస్ హైస్కూల్ సికింద్రాబాద్ లో ని శ్రీరామనవమి వేదిక. గత 56 సంవత్సరాలుగా ఈ ఉత్సవం నిరంతరాయంగా ఇక్కడ జరుగుతూనే ఉండటం గమనార్హం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మార్చి 22 నుంచి ఏప్రియల్ 8 వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవంలో భాగంగా ... ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ప్రముఖలచే ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు,వేద పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణ, పిల్లలచే సంగీత కచేరీలు, వేదాంత దేశిక పుస్తక ఆవిష్కరణ, సీతాపరిణయం అనే నృత్య నాటకం వంటి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్సియర్ కన్సల్టెంట్  శ్రీధర్ శుభశ్రీగారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రుల  ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 

ఈ కార్యక్రమంలో ..శ్రీ వేలుక్కుడి కృష్ణన్  స్వామి, శ్రీమతి సుచిత్ర మరియు సైంధవి, డా.ఆర్ మధు, డా.జ్ఞాన సంభంధన్, దుష్యంత్ శ్రీధర్ వంటి ప్రముఖులు పాల్గొనటంలో భక్తులు విశేషంగా ఈ పోగ్రామ్ లకు హాజరవుతున్నారు. 
 
జై శ్రీరామ్ ...

comments